కేంద్రం, కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు
కుటుంబ సభ్యుల కంటే కార్యకర్తలే తనకు ప్రాణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన విజయ శంఖారావం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయ ఢంకా మోగించి ఎన్నికల ప్రచార భేరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రత్యేక హెదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదన్నారు. మోదీ నమ్మక ద్రోహనికి నిరసనగా తిరుగుబాటు చేశామని అన్నారు. హోదా కోసం పోరాడుతున్న మనపై దాడులు చేశారని చెప్పారు. మా కార్యకర్తలు బాంబులు, బుల్లెట్లకే భయపడరు. ఇక కేంద్రం బెదిరింపులకు ఏం భయపడతారు? కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే తగిన గుణపాఠం చెబుతాం. తెలంగాణ ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తిరిగి మనమే ఇవ్వాలని చెబుతోందని అని ముఖ్యమంత్రి అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కి తెలంగాణ అడ్డుపడుతోందన్నారు. జులైలో పోలవరం నీళ్లు కృష్ణానదికి వస్తాయని సృష్టం చేశారు. ఈ ఏడాదిలో పోలవరం పనులు పూర్తవుతాయన్నారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ని వదిలి వచ్చామని చెప్పారు. నెత్తిన అప్పుపెట్టుకుని ఇక్కడికి వచ్చామన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర నిధులు ఇవ్వలేదని చెప్పారు. టీడీపీపై నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారని అన్నారు.