అందుకే టీడీపీ అభ్యర్థులను గెలిపించండి : చంద్రబాబు
కుట్ర రాజకీయాల కోసం మన జీవితాలతో ఆడుకుంటే అడ్రస్ గల్లంతు చేస్తామని ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మనకు సహకరిస్తున్నాయని అన్నారు. ఒక బీజేపీ మాత్రమే వ్యతిరేకంగా ఉందని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన మోదీకి బుద్ది చెప్పాలని అన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ నాటకాలాడుతున్నారు. కడపలో ఎప్పటినుంచో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న అమీర్ బాబుకు టికెట్టిచ్చాం. ఆదినారాయ రెడ్డి మంత్రిగా ఉన్నా పార్టీ విజ్ఞప్తి మేరకు ఎంపీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అర్థం చేసుకోనే వారు టీడీపీ నాయకులు, వీళ్లకు వైకాపా అభ్యర్థులకు మధ్య పోలికా ఉందా? ఇంట్లో సొంత బాబాయిని చంపారు. సాక్ష్యాలను చెరిపేసేందుకు ఇక్కడే ఉండే ఎంపీనే సహకరించారు. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని పిలుపునిచ్చారు.