ASBL Koncept Ambience

ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి... చంద్రబాబు

ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి... చంద్రబాబు

ఎన్‌ఆర్‌ఐలు జన్మభూమిలో అనుసంధానం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహానాడు రెండోరోజు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు ఎక్కడైనా పెట్టవచ్చన్నారు. అమెరికా సమాజంతోనూ అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. జన్మభూమిని మర్చిపోవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెంచుకుని ముందుకు పోతామన్నారు. ఎన్‌ఆర్‌ఐలు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కష్టపడటం మన నైజం,  కష్టపడితేనే దేనినైనా సాధించగలుగుతామన్నారు. ప్రతి పనిని డాక్యుమెంటేషన్‌ చేస్తున్నామన్నారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కావన్నారు. ఏది చేసిన 95శాతం పాజిటీవ్‌గా ఉండాలన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫలితాలను చూపే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు.

స్వచ్ఛ్‌ ఆంధ్రప్రదేశ్‌, స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ నివాదంతో అందరూ పనిచేయాలన్నారు. గ్రామాల్లో మురుగు కాల్వలను పూర్తిచేశామన్నారు. 5.50 లక్షల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశామన్నారు. అభివృద్ధిపై నిందలేస్తే నీలదీయాలని పిలుపునిచ్చారు.  ప్రతీ గ్రామం స్మార్ట్‌ విలేజ్‌ కావాలని దాని కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. విపక్షాలకు ఓట్లు అడిగే పరిస్థితిలేదన్నారు.

 

Click here for Event Gallery

 

Tags :