ASBL Koncept Ambience

కర్నూలు చేరుకున్న చంద్రబాబు.. బాబు వస్తేనే జాబు అంటూ యువత నినాదాలు

కర్నూలు చేరుకున్న చంద్రబాబు.. బాబు వస్తేనే జాబు అంటూ యువత నినాదాలు

కర్నూలు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు, తెలుగు యువత ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి విమానంలో బుధవారం సాయంత్రం చంద్రబాబు కర్నూలు సమీపంలోని ఓర్వకల్లుకు చేరుకున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో లాండ్ అయిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చరితా రెడ్డి సమక్షంలో భారీగా పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. చంద్రబాబును స్వాగతించేందుకు అక్కడకు చేరుకున్న తెలుగు యువత ‘బాబు వస్తేనే జాబు’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోడుమూరుకు చేరుకున్న చంద్రబాబు అక్కడ దివంగత నేత, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు రాత్రికి అదోనీలోనే బయ చేసి మరో రెండు రోజులు జిల్లాలోనే పర్యంటించనున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ పార్టీ పరిస్థితులు, ప్రజలకు ఉన్న సమస్యలు, వైసీపీ చేస్తున్న అక్రమాల గురించి పార్టీ శ్రేణులు చంద్రబాబు ఆరా తీయనున్నారని, ఇందుకోసం పకడ్బందీగా చంద్రబాబు వ్యూహ రచన చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :