ASBL Koncept Ambience

ట్రంప్ విందు బాధ్యత చూస్తున్న సురేష్ ఖన్నా

ట్రంప్ విందు బాధ్యత చూస్తున్న సురేష్ ఖన్నా

భారత్‍ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ఆహార పానీయాల బాధ్యతను ఫ్యూచర్‍ ల్యాండ్‍ మార్క్ హోటల్‍లో చెఫ్‍గా పనిచేస్తున్న ప్రముఖ చెఫ్‍ సురేష్‍ ఖన్నాకు అప్పగించారు. అహ్మదాబాద్‍ పర్యటనలో భాగంగా ట్రంప్‍ అక్కడి సబర్మతి ఆశ్రమంలో భోజనం చేయనున్నారు.  చెఫ్‍ సురేష్‍ ఖన్నా ట్రంప్‍ కోసం స్పెషల్‍ కార్న్ సమోసా, అల్లం టీ, మసాలా టీ తయారు చేశారు. సురేష్‍ ఖన్నా తయారు చేసే అల్లం టీ, మసాలా టీలను ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో మెచ్చుకున్నారు. ఖన్నా గత 17 ఏళ్లుగా గుజరాత్‍కు వచ్చే అతిథులకు మెనూ తయారు చేస్తుంటారు

 

Tags :