108 దివ్యదేశాల సందర్శనం కడు పుణ్యఫలం
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న శ్రీరామనగరం ప్రాంతంలోని శ్రీ రామానుజాచార్య సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్ ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని శ్రీ చినజీయర్‌స్వామి పేర్కొన్నారు. సహస్రాబ్ది మూడవరోజు పూజా కార్యక్రమాల్లో ఆయన యాగశాలలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరేళ్లపాటు నిర్విరామంగా శ్రమించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల కట్టడాలను, ప్రతిష్ఠలను, శాస్త్రోదికాలను పరిశీలించిన తర్వాత శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో 108 దివ్యదేశాలను ప్రతిష్ఠించుకోవడం ఇక్కడ ప్రజల పుణ్యఫలంగా ఆయన అభివర్ణించారు.
Tags :