తానా మహాసభల్లో చిత్తూరు జిల్లావాసుల సమావేశం 28న
తానా మహాసభల్లో చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల 5వ సమ్మేళనం కూడా జరగనున్నది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సన్మానిస్తున్నారు. శ్రీకాళహస్తికి చెందిన ప్రఖ్యాత కలంకారీ నిపుణుడు పద్మశ్రీ జొన్నలగడ్డ గురప్ప శెట్టి, డాక్టర్ హరనాథ్ పులిచెర్లను జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించనున్నారు. ఈ సమావేశాలకు ముఖ్యఅతిధులుగా బిఆర్ నాయుడు, సిఐఎస్‌ఎ విశ్రాంత డైరెక్టర్ నీలాయపాలెం విజయ్‌కుమార్ హాజరవుతున్నట్లు చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం అధ్యక్షుడు సునీల్ పాంత్ర, ప్రధాన కార్యదర్శి లంకిపల్లి శివ చెప్పారు.
Tags :