చిత్తూరు ఎన్నారైల మీట్ కు మంచి స్పందన
తానా 22వ మహాసభల్లో చిత్తూరు జిల్లావాసులు కూడా సందడి చేశారు. చిత్తూరు జిల్లావాసులంతా మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొని తమ జిల్లా విషయాలను చర్చించారు. డీ.కె.ఆదికేశవులునాయుడు కుమార్తె డీ.ఎ.తేజస్విని గీతాలపన అలరించింది. కొణిదెల లోకేష్ నాయుడు, పంత్ర సునీల్‌లు సమన్వ్యకర్తలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి తానా తదుపరి అధ్యక్షుడు జే తాళ్ళూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అధ్యాపకులు భాను, చిత్తూరు జిల్లా ప్రవాసులు కొమ్మినేని విజయ్, మిమిక్రీ కళాకారుడు మాధవ వర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags :