నాట్స్ సంబరాల్లో సినీ రచయితల ముచ్చట్లు
న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో జరగనున్నాయి.
ఈ సంబరాల్లో భాగంగా తెలుగు సినీ రచయితలతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సినీ రచయితగా నా ప్రస్థానం, మాటా మంతి పేరుతో ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, సిరాశ్రీ, బలభద్రపాత్రుని రమణి పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్పారు.
Tags :