సినీతారలకు పెద్దపీట వేసిన తృణమూల్
దక్షిణాదిన సినీ తారలు ఎప్పటి నుంచో రాజకీయాలను శాసిస్తున్నారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, జయలలిత ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు రజనీకాంత్, కమల్‌హసన్ రాజకీయాల్లోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు రాజకీయాల్లో ప్రభంజనాన్ని సష్టించారు. ఉత్తరాదిన రాజ్‌బబ్బర్, హేమమాలిని, వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లో రాణించారు. పశ్చిమ బెంగాల్‌లో తణమూల్ కాంగ్రెస్ సినీ గ్లామర్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. 2009లో శతాబ్ది రాయ్, తపస్ పాల్ తణమూల్ ఎంపీలుగా ఘనవిజయం సాధించారు. జాతీయ పార్టీ బీజేపీ కూడా సినీ గ్లామర్‌కు ఉపయోగించుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ప్రముఖ నేపథ్యగాయడు. ఆయన కేంద్ర కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే నటి రూపా గంగూలీ బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. టీవీలో ప్రసారమైన మహాభారత్ ధారావాహిక సీరియల్‌లో ఆమె ద్రౌపది పాత్ర పోషించారు.
ఈసారి పశ్చిమబెంగాల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సినీగ్లామర్‌ను విరివిగా ఉపయోగించుకుంటోంది. అందుకు అనుగుణంగా సినిమాల్లో పాపులర్ అయిన ప్రముఖులకు అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టింది. తణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐదుగురు సినీ తారలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఐదుగురు సినిమా తారలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఇప్పుడూ అదే వ్యూహంతో ముందుకెళుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. 2009 ఎన్నికల్లో 19 సీట్లు, 2014లో 34 సీట్లు తణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రచారంలోనూ సినీ గ్లామర్‌ను బాగానే వాడుకున్నారు. బహిరంగ సభలకు సినీ, టీవీ నటులను రప్పించి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తికి జాదవ్‌పూర్ నుంచి టిక్కెట్ ఇచ్చారు. కోల్‌కతా నగర పరిధిలోనే ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1984 ఎన్నికల్లో మమత ఇక్కడ నుంచే ఘనవిజయం సాధించారు. ఆమె సాధించింది మామూలు గెలుపుకాదు. సీపీఎం దిగ్గజం సోమ్‌నాథ్ చటర్జీని ఓడించడం ద్వారా అందరి దష్టినీ ఆకర్షించారు. 16వ లోక్‌సభలో తణమూల్ కాంగ్రెస్ తరఫున సుగాతా బోస్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి సుగతా బోస్‌కు యూనివర్శిటీ అనుమతి ఇవ్వలేదు. దీంతో మిమీ చక్రవర్తిని త ణమూల్ అధినేత్రి రంగంలోకి దించారు. మరో బెంగాలీ తార నస్రత్ జహాన్‌ను బసీర్‌హాట్ నుంచి టీఎంసీ నిలబెడుతోంది.
ఈ నియోజకవర్గం 24 పరగణాలు జిల్లాలో ఉంది. ప్రస్తుతం టీఎంపీ తరఫున ఇద్రిస్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి అలీ మొగ్గుచూపడంతో ఆయనను తప్పించి జహాన్‌కు టికెట్ ఇచ్చినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. వీరిద్దరే కాకుండా సినీ రంగానికే చెందిన దీపక్ అధికారి (దేవ్), శతాబ్దిరాయ్, మూన్‌మూన్ సేన్‌ను త ణమూల్ ఎన్నికల బరిలో దించింది. దీపక్ అధికారి, రాయ్ సిట్టింగ్ ఎంపీలే. సిట్టింగ్ ఎంపీలైన దేవ్, రాయ్ ఘాటల్, బిరూÄమ్‌ే నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. మూన్‌మూన్ సేన్‌ను మాత్రం బంకురా నుంచి అసన్‌సోల్‌కు మార్చారు. అలాగే తణమూల్ సిట్టింగ్ ఎంపీలు తపస్ పాల్, సంధ్యారాయ్ ఈసారి పోటీలో లేరు. వీరిద్దరూ ఒకప్పుడు బెంగాల్ వెండితెరను ఏలినవారే.