ASBL Koncept Ambience

తయారీరంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం - చంద్రబాబు

తయారీరంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తాం - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తయారీరంగం కంపెనీలలో పెట్టుబడులను ప్రోత్సహించేలా ప్రత్యేక నిధి ఏర్పాటు దిశగా ఆర్డర్‌ ఈక్వీటీ పార్టనర్స్‌ కు చెందిన రమణ జంపాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ  సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించారు.  ఈక్విటీ భాగస్వాములు ప్రముఖ తయారీ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ కు రప్పించేలా చొరవ చొపుతారు. దీనికోసం తమ సంస్థల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఇందుకోసం ఆర్డర్‌ ఈక్విటీ పార్టనర్‌ (ఏఈపీ) రూ.200 కోట్ల ఉమ్మడి భాగస్వామ్య నిధిని ప్రతిపాదిస్తుంది. దీనిలో భాగంగా పోర్ట్‌ ఫోలియో కంపెనీలు తమ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి తరలించేలా చర్యలు చేపడతారు.

రాబోయే 18 నెలల్లో ఏఈపీ, రాష్ట్రప్రభుత్వం కలిపి ముందుగా రూ.150 కోట్లు పెట్టుబడులు పెడతారు. మరో రూ.50 కోట్ల ఉమ్మడి నిధితో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తారు. ఈ ఫైలట్‌ ఫండ్‌ ఆధారంగా రాబోయే రోజుల్లో 1500 నుంచి 2000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఈ ఉమ్మడి భాగస్వామ్యం ప్రయత్నం వల్ల రాష్ట్ర ఆర్థికరంగం గణనీయంగా అభివ ద్ధి చెందుతుంది. 10వేల నుంచి 20వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. అంతర్జాతీయస్థాయిలో ఉన్న తయారీరంగ సంస్థలు సుమారు 20 వరకు ఈ ప్రతిపాదన ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల పన్ను రూపంలో ఏటా 100 నుంచి 250 కోట్ల రూపాయలు సమకూరుతుంది. ఆంధ్రప్రదేశ్‌ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ.200 కోట్లు ఈ జాయింట్‌ వెంచర్‌ ద్వారా వస్తుందని అంచనా. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ తయారీరంగ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై విధివిధానాలు చర్చించిన ముఖ్యమంత్రి భవిష్యత్‌ లో ఈ భాగస్వామ్యం మరింత ప్రయోజనకారిగా ఉండేలా చొరవ చూపాలని ఆర్డర్‌ ఈక్వీటీ పార్టనర్స్‌ ను కోరారు.

 

Tags :