ASBL Koncept Ambience

ఎపిలో పెట్టుబడులకు మేము రెడీ అన్న ఎన్నారైలు...

ఎపిలో పెట్టుబడులకు మేము రెడీ అన్న ఎన్నారైలు...

చికాగోలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపరచడంలో తమవంతుగా అక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఎన్నారైలు ముందుకొచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా చిికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. గ్లోబల్‌ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ నెట్‌వర్క్‌ (జీ-టెన్‌) సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐటీ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఏపీలో 12 నెలల్లో 500 కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.  విజయవాడ నగరంలో ఐటీ సంస్థలకు ఏర్పాటుకు 60 ఎన్నారై కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఐటీ సర్వీసులు, బిజినస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. చికాగోలో తెలుగు ఐటీ నిపుణులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

రెండు దశాబ్దాల క్రితం నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయి. చికాగోలో మిమ్మల్ని చూస్తుంటే నేను హైదరాబాద్‌లో ఉన్నానా లేక విజయవాడలో ఉన్నానా అని అశ్చర్యం కలుగుతోంది. ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా తెలుగువారు వేల సంఖ్యలో ఉంటారు. ప్రత్యేకించి ఐటీలో మనవాళ్లదే హవా. మనవాళ్లు ఇక్కడ ఎక్కువగా ఎంటర్‌ఫ్రెన్యూర్లుగా ఎదగడం సంతోషాన్నిస్తోంది అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వ పక్షానే ఉన్నారని, దీనికి నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో సూక్ష్య సేద్యానికి, ఉద్వాన వన పంటలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అక్వాపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలో  అమెరికా  అంతటా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయని చెప్పారు. వచ్చే నెలలో బిల్‌ గేట్స్‌, మిలిండా గేట్స్‌ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకోవాలి. పుట్టిన గడ్డకు ఎంతో కొంత ఇచ్చేయాలి. అదే సమాజంలో మిమ్మల్ని ఆదరించి, ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను మరిచిపోద్దు., మంచి జాబ్‌ ఉందని సరిపెట్టుకోకుండా మీరే మరికొంత మందికి ఉద్యోగాలు ఇచ్చి సంపద సృష్టించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. షికాగోలో సమావేశం అనంతరం చంద్రబాబు తన బృందంతో కలిసి డియోయిన్స్‌కు ప్రయాణమయ్యారు. వర్చువల్‌ రియాల్టీ అప్లికేషన్‌ సెంటర్‌ను సందర్శించారు. ఐఎస్‌యూ రీసెర్చ్‌ పార్కులో రౌండ్‌ టేబుల్‌ సామావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు ఐయోవా గవర్నర్‌ విందు ఇచ్చారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్‌పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్‌ కన్సల్టేషన్‌ వర్క్‌షాపు నిర్వహించారు.

చంద్రబాబుతో షికాగో స్టేట్‌ వర్సిటీ చైర్మన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ రోహన్‌ అత్తెలే సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మేలో యూనివర్సిటీ 150వ స్నాతకోత్సవంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించారు.

Tags :