ASBL Koncept Ambience

హైదరాబాద్ కంటే అద్భుతంగా అమరావతి : చంద్రబాబు

హైదరాబాద్ కంటే అద్భుతంగా అమరావతి : చంద్రబాబు

కుప్పం నియోజకవర్గానికి తాను వెళ్లకపోయినా, రాష్ట్రంలోనే అధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సభలో  చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనల్ని అడుగడుగునా అవమానించారన్నారు. కేసీఆర్‌ మనల్ని కుక్కలు, పనికిరాని వ్యక్తులని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేస్తే మనం ద్రోహులమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కూర్చొనేందుకు కుర్చీ లేకుండా చేశారని విమర్శించారు. హైదరాబాద్‌ కంటే అద్భుతంగా అమరావతి నిర్మిస్తామన్నారు. ఏపీలో 20 హైదరాబాద్‌లు తయారు చేస్తానని అన్నారు.

పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో వర్షం పడకపోయినా 48 టీఎంసీలు తెచ్చామన్నారు. నాగార్జున సాగర్‌ నుంచి సోమశీలకు నీళ్లు తీసుకొస్తామని సృష్టం చేశారు. సోమశిల, కండలేరు పూర్తయితే రాష్ట్రానికి ఇబ్బంది ఉండదని అన్నారు. పెన్షన్లు పదిరెట్లు పెంచి భరోసా కల్పించామని పేర్కొన్నారు. కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్నను తానేనని అన్నారు. మన చెక్కుల్ని వైసీపీ నేతలు చెల్లవని ఎగతాళి చేశారని, వైసీపీ నేతల నెత్తిన వెయ్యి పెడితే రూ.10కి కూడా ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు. ఆదాల తెలుగుదేశం పార్టీలో ఉండి పనులు చేయించుకుని పక్క పార్టీలోకి వెళ్లిపోయాడని మండిపడ్డారు.

 

Tags :