ASBL Koncept Ambience

అందరికీ అందుబాటులో అమరావతి : చంద్రబాబు

అందరికీ అందుబాటులో అమరావతి : చంద్రబాబు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేందుకే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి శంకుస్థాపన కోసం దేశంలోని పలు పుణ్య క్షేత్రాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి  సేకరించిన మట్టి, నీటికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతమని అన్నారు. లండన్‌ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉండటం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ప్రపంచంలోని సుందరమైన నగరాల్లో అమరావతి మేటిగా నివాలని ఆకాంక్షించారు. రాజధాని శంకుస్థాపన ఓ మహోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి తీసుకొచ్చిన మట్టి, పవిత్ర జలాలను శంకుస్థాపన రోజు హెలికాప్టర్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలో చల్లుతామని అన్నారు. 

 

Tags :