రామ్మోహన్ నాయుడిని అభినందించిన సీఎం చంద్రబాబు
యువకుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను మోస్తూన్నారంటూ ఎంపీని బాబు మెచ్చుకున్నారు. వివాదాలకు తావులేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నాడని యువ ఎంపీకి సీఎం కితాబిచ్చారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం గురించి మాట్లాడిన చంద్రబాబు ఎర్రనాయుడు తమకు ఆత్మీయుడన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబం సేవలను ఎప్పటికీ మరిచిపోలేమంటూ బాబు చెప్పుకొచ్చారు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటుగా మారిందన్నారు. తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందని అన్నారు. యువతలో ఉన్న శక్తిని గ్రహించి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
Tags :