ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం
వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పైలట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చిక్సి అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, రఘురామకృష్ణమరాజు, పార్టీ ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.