ASBL Koncept Ambience

అమరావతి నిర్మాణానికి సహకరిస్తాం : కేసీఆర్

అమరావతి నిర్మాణానికి సహకరిస్తాం : కేసీఆర్

అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా నిర్మాణం కావాలన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంరద్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రజలకు  విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు. ఒక అద్భుత నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అభినందించారు. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి పూర్తిస్థాయిలో సహకరిస్తామని అన్నారు. విజయదశమి నాడు ప్రారంభమైన అమరావతి ప్రపంచంలోనే అద్భుత నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. 


 

Tags :