ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని, గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది కిరికిరిగాల్లు అవగాహన రాహిత్యంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అలాగే దళిత బంధు సంపూర్ణ విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని లక్షా 80 వేల కోట్లు అవసరం ఉందని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడేళ్లలో తెలంగాణ 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతోందని తెలిపారు. దళిత బంధులాంటి పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్ బీజేపీకి అవకాశం ఉన్నా ఎందుకు ఈ ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. శాశ్వత పేదరిక నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఢల్లీిలో గులాములు ఈ ప నులు చేయలేమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంటే చేస్తాయా వారికి ఇది చేయడానికి ఢల్లీి అనుమతి ఇస్తుందా? అని నిలదీశారు. ఢల్లీి సిట్ అంట్ సిట్ స్టాండ్ అంటే స్టాండ్ చేయడమే వాళ్ల బతుకులు అని సీఎం దుయ్యబట్టారు.