కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం
కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్లీనరీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నానునన.. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ సభ పెట్టొదు ఇది ఏం కథ. ఇది ఒక పద్దతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జు సాగర్ సభ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్ సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు.
మన పార్టీ నాయకులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. నవంబర్ 4 వరకు దళిత బంధు అమలును ఆపగలదు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ పార్టీ ఆర్థికపరంగా కూడా శక్తివతంగా తయారైంది. టీఆర్‌ఎస్‌కు కూడా విరాళాలు సమకూరాయి. రూ.240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చట్టబద్ధమైన విరాళాల ద్వారా పార్టీ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయి. 31 జిల్లాలో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.