ASBL Koncept Ambience

ప్రపంచ ఉద్యమాలకే తలమానికం తెలంగాణ ఉద్యమం

ప్రపంచ ఉద్యమాలకే తలమానికం తెలంగాణ ఉద్యమం

టిఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

ప్రపంచ ఉద్యమాలకే తెలంగాణ ఉద్యమం కొత్త బాటను చూపిందని టిఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రజల ఆకాంక్ష, ఆవేశాన్ని మరింత ఉద్యమం వైపు తీసుకెళ్లడం ఎంత సులువైన విషయం కాదన్నారు. దానిని ఒక కార్యాచరణ ప్రణాళికగా మార్చి విజయవంతంగా అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ప్రజల్లో అనేక అపోహలు అనుమానాలు..సందేహాలు.. విశ్వాస రాహిత్య పరిస్థితి ఉండేదన్నారు. హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసిసిలోన టిఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా ఆయన తొమ్మిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ, 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించామని కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగిరిందన్నారు. కొద్దిమంది మిత్రులతో కలిసి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టామన్నారు.స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే ఉద్యమాన్ని అంచలంచలుగా ముందుకు తీసుకెళ్లామని సిఎం కెసిఆర్‌ పేర్కొన్నారు. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశానని కెసిఆర్‌ అన్నారు. అహింసా మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

20 ఏళ్ల కిందట జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరిందని, ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిరదని సిఎం కెసిఆర్‌ అన్నారు. స్వాతంత్య్రోద్యమంలోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదన్నారు. ఆ పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే అంతిమంగా విజయం దక్కిందన్నారు. తెలంగాణకు కూడా అదే పద్ధతి నేర్పించాలని.. దాన్ని కొనసాగించాలని.. ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలని స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగామన్నారు. ఈ ఉద్యమానికి సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వారు వేయని నిందలు లేవు.. పెట్టని తిప్పలు లేవన్నారు. ఎన్ని చేయాలో అన్ని చేశారన్నారు.  తెలంగాణ వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశామన్నారు. పంజాబ్‌ను తలదన్నే రీతిలో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిరచామని కెసిఆర్‌ తెలిపారు. పంటల ఉత్పత్తిని చూసి ఎఫ్‌సిఐ తాము కూడా ఇక బియ్యం కొనలేమని చెప్పిందన్నారు. సమైక్యవాదులు ఏఏరంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో ఆ రంగంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నాయన్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ల ప్రజలు తమను తెలంగాణలో కలపమని కోరుతున్నారన్నారు. అలాగే ఇటీవల కర్నాటకలోని రాయచూర్‌ బిజెపి శాసనసభ్యుడు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేని పక్షంలో తమ ప్రాంతాన్ని ఆ రాష్ట్రంలో కలపాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారని కెసిఆర్‌ అన్నారు. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తమయ్యాయో ఆయా రంగాల్లో విజయం సాధించి చూపామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేస్తున్న గణాంకాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి నిదర్శమన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందడం తన ఒక్కడి వల్ల సాధ్య పడలేదని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇందులో అందరి కృషి ఉందని తెలిపారు. ప్రతిపక్ష శక్తులు అపుడు, ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయని, అన్నింటిని అధిగమించి ముందుకు దూసుకు పోతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. వాటన్నింటిని అధిగమించామన్నారు. రాష్ట్రంలో కులం, మతం అనే ఇరుకైన ఆలోచన తమకు లేదన్నారు. దళిత బంధు ఓ సామాజిక స్వాతన పథకమని వెల్లడిరచారు. ఇది దేశానికి స్ఫూర్తి అని అన్నారు. రైతు బంధు ప్రారంభించినపుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. దళిత బంధుకు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఓ పెద్ద లెక్క కాదన్నారు. ఈ మధ్య ఢల్లీి వెళ్ళినపుడు కొందరు సిఎంలు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగార న్నారు. దానికి సాహసం కావాలని, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని చెప్పారు. దళిత బంధును కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తామన్నారు. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని తెలిపారు. 2028 బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లు కాగా తలసరి ఆదాయం రూ.7.76 లక్షలు చేరుకుందన్నారు.

దళితబంధుతోనే ఆగిపోమని ఎన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టామని తెలిపారు.   బలమైన ఆర్థిక శక్తిగా కూడా గులాబీ పార్టీ ఎదిగిందని తెలిపారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. పాలమూరులో పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సిఎంలు ఆశ్చర్యపోతున్నారన్నారు. ఏదీ ఏమైనా తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

క్రీడల అభివృద్ధికి పెద్దపీట: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

సిఎం కెసిఆర్‌ అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా పాలసీని రూపోందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌ గా తీర్చిదిద్ధ బోతున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని లాల్‌ బహదూర్‌ స్టేడియం లో ఇండియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పెడరేషన్‌ అధ్వర్యంలో జరగనున్న జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌-2021 బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగా జాతీయ పవర్‌ లిప్టింగ్‌ చాంపియన్‌ షిఫ్‌కు హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్నామన్నారు. నగరంలోని లాల్‌ బహదూర్‌ ఇండోర్‌ స్టేడియంలో నవంబర్‌ 16 నుండి 20 వరకు జాతీయ పవర్‌ లిప్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ ను పెడరేషన్‌ నిర్వహిస్తుందన్నారు. ఈ చాంపియన్‌ షిప్‌లో 26 రాష్ట్రాలు పాల్గోనబోతు న్నాయన్నారు.

కరోనా పరిస్థితుల తర్వాత జాతీయ స్థాయిలో ఈ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపా యాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ నగరం అంత ర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, కబడ్డీ, రెస్లింగ్‌, బాడీ బిల్డింగ్‌, పుట్‌ బాల్‌ లాంటి అనేక క్రీడాంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం, నగదు పురస్కారాలను ఘననీయంగా పెంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాము. క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విధ్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లును కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని నిర్మిస్తున్నా మన్నారు. పవర్‌ లిప్టింగ్‌లో మన తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు రాజశ్రీ, శ్రీనాధ్‌, సాయి లలీత్‌, రాజశేఖర్‌ లాంటి క్రీడాకారులను తెలంగాణ క్రీడా శాఖ ద్వారా ఎంతో ప్రోత్సాహన్ని అందిస్తున్నామన్నారు.

3 ఐలతో దూసుకెళుతున్న తెలంగాణ - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు

తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు  త్రీ ఐ మంత్రం నడుస్తోందని, ఈ మూడిరటినీ దేశవ్యాప్తంగా అమలు చేస్తే కచ్చితంగా నయా భారత్‌ను కొత్త తరానికి అందించొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే విషయం చెప్పానని గురు ్తచేశారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూ సివ్‌ గ్రోత్‌ అని వివరించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో ‘పరిపాలన సంస్కరణలు, విద్యుత్‌ రంగాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటి రంగం అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన’ తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో ‘త్రీ ఐ’తో నడుస్తుందన్నారు. సమగ్ర కుటుంబసర్వే దేశ చరిత్రలోనే సంచలనం అన్నారు.సమగ్ర కుటుంబ సర్వేతో సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లగలిగామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి.. అక్షాంశాలు, రేఖాంశాలతో భూములను గుర్తించి పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్‌, యాపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్‌. ఫేస్‌బుక్‌ ఫస్ట్‌ ఫేవరేట్‌ డెస్టినేషన్‌ హైదరాబాద్‌. ఐటీ అంటే ఇన్‌క్రెడిబుల్‌ తెలంగాణ. దేశంలోనే అతిగొప్ప స్టార్టప్‌గా రాష్ట్రం అవతరించిందన్నారు. బెంగాల్‌ ఆలోచించేది దేశం మొత్తం ఆలోచిస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు తెలంగాణ ఆలోచించేదే దేశం ఆలోచిస్తోందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారు. ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారు. టీఎస్‌ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు బారులు తీరుతున్నాయి. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదు. ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాం. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారాం. నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికే ఆదర్శమైంది. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి హైదరాబాద్‌ బ్యాకప్‌ మాత్రమే. ఇవాళ ఐటీకి హైదరాబాద్‌ బ్యాక్‌ జోన్‌ అయింది’’ అన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏడేళ్ల పాలన తెలంగాణలో సంస్కరణలకు స్వర్ణ యుగమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏడున్న రేళ్ల ప్రస్థానంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన స్వర్ణ యుగాన్ని తెచ్చింది. ధరణి ఒక సంచలనమని, దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంస్క రణలు ఇతర రాష్ట్రాలకే కాదు.. దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు.  కట్టుకథలకు పెట్టుబడులు రావని గత ప్రభు త్వాలకు హితవు చెప్పారు. పరిశ్రమలంటే టాటా, బిర్లాలు కాదు. కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలేనని స్పష్టం చేశారు.  టీఎస్‌ బీపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూ కట్టాయన్నారు. తయారీ రంగ పరిశ్రమలో తె లంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపం చానికి రాజధానిగా మారామని తెలిపారు. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్రగా మారిందన్నారు.

కొత్త రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికార వికేంద్రీ కరణ ఫలాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో సరికొత్తగా పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించామ న్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశా మన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా గుర్తించి అవార్డులు ఇస్తోందని చెప్పారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పోలీసు కమిష నరేట్లను తొమ్మిదికి పెంచామన్నారు. దేశంలోనే లా అండ్‌ ఆర్డర్‌లో తెలంగాణ ఫస్ట్‌ ఇన్‌ సేఫ్టీ%ౌౌ% బెస్ట్‌ ఇన్‌ సెక్యూ రిటీ అనే విధంగా పేరు తెచ్చుకుందన్నారు. ధరణి పోర్టల్‌తో భూ రికార్డుల ప్రక్షాళన మొద లు పెట్టిందన్నారు. త్వర లోనే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామన్నారు.

గడిచిన ఏడేళ్లలో సీఎం కేసీఆర్‌ పాలనలో ఎన్నో రకాల పరిపాలనా సంస్కరణలు తెలం గాణలో ఆవిష్కృతమ ృయ్యాయన్నారు. పాల కుల, అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధి కారాన్ని ప్రజల చేతికి అందించామని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలకు అందుతున్నా యన్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించామన్నారు. ఈ ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణలో ఎన్నో సంస్కరణలతో కూడిన సువర్ణ అధ్యాయాలు నమోదవుతున్నాయన్నారు. అందులో మొదటిది సమగ్ర కుటుంబ సర్వే అని తెలిపారు. పరి పాలనా సంస్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం అని ప్రజలకు చెందిన సమాచారాన్ని ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుసుకుందన్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే సమగ్ర కుటుంబ సర్వే యజ్ఞా నానికి శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క రోజులోనే దేశం అబ్బురపడేలా తెలంగాణ ప్రజల బతుకు చిత్రాలను గణం కాలతో సహా సేకరించి సంచలనం సృష్టించినట్లు వివరించారు.

తెలంగాణ స్టార్టప్‌..

టీఎస్‌ బీపాస్‌ ద్వారా తెలంగాణకు పరి శ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నా యని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొత్త స్టార్టప్‌లు, పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణ స్టార్టప్‌ అంటుంటే కేంద్ర ప్రభుత్వం ప్యాకప్‌ అంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభు త్వం తెగనమ్ముతోందని, ప్రయివేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు.

 

Tags :