సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. శ్రీ రామానుజ సహస్త్రాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. జీయర్ స్వామితో కలిసి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం కార్యక్రమం పూర్తయింది. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో అగ్నిహోత్రంలో 1035 కుండలాల్లో హోమం చేశారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మరోవైపు సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆయన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు.