ASBL Koncept Ambience

సీఎం రేవంత్‌ కు అరుదైన గౌరవం

సీఎం రేవంత్‌ కు అరుదైన గౌరవం

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆయన ఎక్కడ పోయినా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది.   రేవంత్‌పై తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. పర్యటనకు వెళ్లిన తొలిరోజే ఎయిర్‌పోర్టులో అపూర్వ సాగ్వతం లభించింది. న్యూయార్క్‌ సిటీలో ఇటీవల రేవంత్‌ అభిమానులు, కాంగ్రెస్‌ మద్దతుదారులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. తాజాగా.. ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ స్ట్రీట్‌లో రేవంత్‌ రెడ్డి ఫోటోలను అక్కడి బిగ్‌ స్రీన్లపై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టైమ్‌ స్క్వేర్‌ సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అలాంటి చోట రేవంత్‌ ఫోటోలు బిగ్‌ స్కీన్‌పై ప్రదర్శించటం అరుదైన గౌరవం అనే చెప్పాలి.  ఇక అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ను తలపించేలా హైదరాబాద్‌ నగరంలోనూ టీ స్క్వేర్‌ నిర్మించాలని రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మల్టీపర్పస్‌ హబ్‌ దీన్ని నిర్మించాలని డిసైడ్‌ అయింది. రాయదుర్గంలో డెవలప్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టెండర్లను సైతం టీజీఐఐసీ ఆహ్వానించింది. దీని నిర్మాణంతో హైదరాబాద్‌ సిగలో మరో ఐకానికి ల్యాండ్‌ మార్క్‌ గా దీనిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.

 

 

 

Tags :