దావోస్‌లో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం
కర్బన్ ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్బన్ ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన అనే అంశంపై దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, భశిష్యత్తులో ఈ దిశగా అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, ప్రత్యామ్నాయ ఇంంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడికి రావడానికి కొద్ది రోజుల కిందట కర్నూలులో 5,230 మెగావాట్ల సమీకృత పునరుత్పాదక విద్యుత్ నిల్వ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం అని పేర్కొన్నారు. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ సీఈవో అదిత్య మిత్తల్, గ్రీన్‌కో గ్రూప్ సీఈవో అనిల్ పాల్గొన్నారు.