పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం : వైఎస్ జగన్
విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ( గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్) పూర్తయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుంచి వచిచన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని, నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 15 కీలక రంగాల్లో పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని, గ్రీన్ ఎవనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల సదస్సులో 352 ఒప్పందాలు (ఎంవోయూ) జరగ్గా మొత్తంగా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని, పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.