ASBL Koncept Ambience

తానా మహాసభల్లో సిఎంఇ

తానా మహాసభల్లో సిఎంఇ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసిలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో సిఎంఇ కార్యక్రమం కూడా ఒకటి. వైద్యరంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులపై అవగాహన కలిగించేందుకు వీలుగా వైద్యరంగంలో నిష్ణాతులైన వారితో ప్రసంగాలను, అవగాహన కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్‌లో ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. జూలై 6వ తేదీ శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ కార్యక్రమంలో డా. సూర్యనారాయణ శ్రీరామ్‌, డా. వాణీరావు, డా. ఉజ్వలదీక్షిత్‌, డా. వేణు బత్తిని, డా. కల్పన తమ్మినేని, డా. జి. రవీంద్రనాథ్‌, డా. విష్ణురావు వీరపనేని పాల్గొంటున్నారని సిఎంఇ చైర్స్‌ డా నవీన హేమంత్‌, డా. శ్రీనగేష్‌ పాల్వాయ్‌ తెలిపారు.

పలు అంశాలపై ఈ కార్యక్రమంలో డాక్టర్లు తమ ప్రసంగంతోపాటు అవగాహనను కల్పించనున్నారు. Treatment for uncomplicated appendicitis: Antibiotics or surgery  అన్న అంశంపై డా. సూర్యనారాయణ శ్రీరామ్‌ ప్రసంగిస్తారు. ognition dementia and chronic encephalopathy అంశంపై డా. వాణీరావు ఎండి మాట్లాడుతారు. Mood disorders in children  అంశంపై డా. ఉజ్వల దీక్షిత్‌ ప్రసంగిస్తారు. Immunotherapy: Can the New Frontier Cure Advanced Cancer?  అంశంపై డా. వేణు బత్తిని మాట్లాడుతారు. కాఫీ బ్రేక్‌ సమయంలో మెడికల్‌ స్టూడెంట్స్‌ ప్రజంటేషన్‌ చేస్తారు.

Hypercholesterolemia in children అంశంపై డా. కల్పన తమ్మినేని ప్రసంగిస్తారు. హెపటిక్‌, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంశంపై డా. జీ. రవీంద్రనాథ్‌, అస్మా, స్నోరింగ్‌, అలర్జీ అంశాలపై డా. విష్ణురావు వీరపనేని మాట్లాడుతారు. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వైద్యరంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడంతోపాటు తమ సందేహాలను తీర్చుకోవచ్చని కాన్ఫరెన్స్‌ కమిటీ పేర్కొంది.

 

Tags :