నాటా మహాసభల్లో సిఎంఈ కార్యక్రమాలు
నాటా మహాసభల్లో భాగంగా మెడికల్ రంగంలో ఇటీవల వచ్చిన మార్పులపై డాక్టర్లతో చర్చాకార్యక్రమం, సమావేశాలను సిఎంఇ కమిటీ ఏర్పాటు చేసింది. హంట్స్‌విల్లే హాస్పిటల్, ఎఎల్‌తో కలిసి మెడికల్ రంగంలో ఇటీవల వచ్చిన మార్పులు, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ 2023పై సమావేశాన్ని నిర్వహిస్తోంది. జూలై 1వ తేదీ శనివారంనాడు మధ్యాహ్నం 1. గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనున్నది. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా శ్రీనాధ వట్టం, ఎండి వ్యవహరిస్తున్నారు. ప్రోగ్రామ్ ఫ్యాకల్టీ/కోఆర్డినేటర్లుగా సురేష్.కర్నే, ఎండి, అనుపమ ఊదరియ,ఎండి ఉన్నారు. అనుపమ. వూడర్ల,ఎండి, ఆదిశేష బి రెడ్డి, ఎండి,మోడరేటర్లుగా వ్యవహరిస్తున్నారు.
* ప్లానింగ్ కమిటీ సభ్యులుగా బి నారాయణ రెడ్డి ఎండి, పవన్ కుమార్, ఎండి, శ్రీపతి కేతు, ఎండి, ప్రతాప్ తుమ్మల, ఎండి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి నరాల, ఎండిగా వ్యవహరిస్తున్నారు.
* మధ్యాహ్నం 1.00 నుంచి 1.10 వరకు సిఎంఇ యాక్టివిటీపై చర్చ,
* 1.10 నుంచి 1.30 వరకు గట్ మైక్రోబ్స్ అంశంపై డా. జి. నాగేశ్వర రెడ్డి, ఎండి ప్రసంగం
* 1.30 నుంచి 1.50 వరకు లీన్ డయాబెటిక్స్ అంశంపై బెల్లంకొండ కె. కిషోర్ ఎండి ప్రసంగం
* 1.50 నుంచి 2.10 వరకు రోల్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హెల్తీ లివింగ్‌పై డా. ఆదిశేష బి. రెడ్డి, ఎండి ప్రసంగం
* 2.10 నుంచి 2.30 వరకు నియోనటల్ అండ్ ఇన్‌ఫంట్ మార్టలిటీ, నేషనల్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్‌పై డా. రామసుబ్బారెడ్డి ధనిరెడ్డి, ఎండి ప్రసంగం,
* 2.30 నుంచి 3.00 వరకు లవ్, లైఫ్ స్టయిల్, హెల్తీ, హ్యాపీ లివింగ్ అంశంపై డా. ఇందిరా రామసుబ్బారెడ్డి, ఎండి. ప్రసంగం
* 3.00 నుంచి 3.10 వరకు బ్రేక్,
* 3.10 నుంచి 3.30 వరకు సడన్ కార్డియాక్ డెత్, రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రివెన్షన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియన్స్ అంశంపై డా. కేశవ్ రామిరెడ్డి, ఎండి ప్రసంగం
* 3.30 నుంచి 3.50 వరకు న్యూ సిడిసి గైడ్ లైన్స్ ఫర్ ప్రిస్కైబింగ్ ఓపియోడ్స్ అంశంపై డా. శ్రీనాధ వట్టం, ఎండి మాట్లాడుతారు.
* 3.50 నుంచి 4.20 వరకు ట్రెండ్స్ ఇన్ యుఎస్ హెల్త్ కేర్ అంశంపై డా. ప్రేమ్ రెడ్డి, ఎండి ప్రసంగం
* 4.20 నుంచి 4.35 వరకు ట్రెండ్స్ ఇన్ యుఎస్ హెల్త్ కేర్ అంశంపై డా. అనుపమ ఊదర్ల, ఎండి ప్రసంగం ఉంటుంది.
* సెవెన్ సింపుల్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ యువర్ మెడికల్ లైసెన్స్ అంశంపై డా. శ్రీని గంగసాని,ఎండి ప్రసంగం
* కొలొన్ కేన్సర్ స్క్రీనింగ్, ప్రివెన్షన్ లేటెస్ట్ అప్ డేట్‌పై డా. శ్రీపతి కేతు,ఎండి ప్రసంగం కూడా ఉంటుంది.
* చివరన 4.35 నుంచి 5.00 వరకు క్వశ్చన్, చర్చా కార్యక్రమం కూడా జరుగుతుంది.