ప్రత్యేక మాస్క్ తయారుచేసిన అమెరికా విద్యార్థిని
ఈ మాస్క్ లు చూడటానికి వెరైటీగా ఉన్నాయి కదా. ఇవి అందరి కోసం కాదు. మూగ, చెవిటి వారికి ప్రత్యేకం. సాధారణ మాస్కులు వాడలేక, వాడినా ఆ ముసుగులో హావభావాలలను వ్యక్తీకరించలేక సతమతమవుతున్న మూగ, చెవిటి వారి కోసం అమెరికా విద్యార్థిని యాప్లే లారెన్స్ వీటిని తయారు చేసింది. ఈ మాస్క్ లకు నోటీ భాగంలో ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఫలితంగా పెదవుల కదలికల ఆధారంగా బధిరుల భాషను, భావ వ్యక్తీకరణను ఎదుటివారు సలువుగా అర్థం చేసుకునేందుకు వీలు కలుగనుంది. ఈ మాస్క్ డిజైన్‍తో యాషే చేసిన ఫేస్‍బుక్ పోస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags :