లోకేష్ పర్యటన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను పురస్కరించుకుని మిల్‌పిటాస్‌లో జనవరి 28వ తేదీన ఏర్పాటు చేసిన స్వాగత సత్కార కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి మిల్‌పిటాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో తీసుకెళ్ళాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా నారా లోకేష్ పనిచేస్తున్నారని, రాష్ట్ర ఐటీరంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో అమెరికాలో ఆయన పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనను అందరూ విజయవంతం చేయాలని, నవ్యాంధ్ర అభివృద్ధికి అందరూ ముందుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఐటీరంగంలో ఉన్న పరిస్థితులను, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను నారా లోకేష్‌తో మీటింగ్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం లభించిందని ఆయన చెప్పారు. ఎన్నారై టీడిపి, ఎపి ఎన్‌ఆర్‌టీ, ఆంధ్రప్రదేశ్ జన్మభూమి కలిసి జనవరి 28వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు ఈ కమ్యూనిటీ రిసెప్షన్ ఉంటుందని ఆయన వివరించారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకట్ కోగంటి, ప్రసాద్ మంగిన, రామ్ తోట, రజనీకాంత్ కాకర్ల, శ్రీకాంత్ కె, యశ్వంత్ కుదరవల్లి, సతీష్ వేమూరి, భాస్కర్ వల్లభనేని, గాంధీ పాపినేని, కొల్లి రాజ, శివరామ్, రజనీకాకరాల, లియోన్ బోయపాటి, కొల్లి నాని, హరి నల్లమల తదితరులు పాల్గొన్నారు.