ఖమ్మం నుంచి రేణుకాచౌదరి
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకాచౌదరి పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. వాస్తవానికి ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్‌రావు పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలించింది. అయితే, ఏఐసీసీ స్థాయిలో మంచి సంబంధాలు ఉండడం, ఇప్పటివరకు ప్రకటించిన 16 మంది అభ్యర్థుల్లో ఒక మహిళ కూడా లేకపోవడం, వరుసగా ఖమ్మం నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రేణుక అభ్యర్థిత్వానికే అధిష్ఠానం మొగ్గు చూపింది. రేణుకాచౌదరి ఢిల్లీలో అంబికాసోని, ఇతర ఏఐసీసీ ముఖ్యనేతలను కలిసి తన వంతు ప్రయత్నాలు చేసుకున్నట్లు చెబతున్నారు. ఈ మేరకు ఉత్కంఠకు తెరదించుతూ రేణుకాచౌదరికే అధిష్ఠానం టికెట్ కేటాయించింది.
Tags :