అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికలవరాలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రత్యేకహోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరోమారు సృష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన కాంగ్రెస్ భరోస సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏపీకి హోదా హామీని నాడు ప్రధాని పదవిలో ఉన్న మన్మోహన్‌సింగ్ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత తమ పార్టీపై ఉదని చెప్పారు. దీన్ని అమలుపరిచే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని సృష్టం చేశారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు హోదా కోసం మోదీపై ఒత్తిడి తేలేకపోయాయని, ఇది తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఏపీలో దేశంలో అగ్రగామిగా చేస్తాం అని రాహుల్ హామీ ఇచ్చారు.
Tags :