కరోనా ని ప్రారంభించింది ఆవిడేనా?
ప్రతిరోజూ కరోనా వైరస్ గురించి వార్తలు చదువుతుంటాం. ఈ మహమ్మారి వైరస్‍ను ప్రపంచానికి అంటించిది చైనాయే అని అమెరికా అధ్యక్షులు ట్రంప్ దగ్గర నుంచి అందరూ అనడం మనం విన్నాము. అయితే చైనా దేశంలో దీనిగురించి ఏమనుకుంటున్నారో తెలుసా?
ఆమెపేరు మాత్జె బెనాసి...ఆమె, ఆమె భర్త ఇద్దరు చైనాలో ఉద్యోగం చేస్తున్న అమెరికా ఆర్మీలో రిజర్విష్ట్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. హఠాత్తుగా చైనా లోని సోషల్ మీడియాలో యూట్యూబ్‍లో ప్రతిరోజు చైనాలోకి కరోనా రోగాన్ని తీసుకోవచ్చిన వ్యక్తి అని పోష్టింగ్‍లు రావడం మొదలయ్యాయి. ఆఖరికి చైనీస్ కమ్యూనిటీ పార్టీ మీడియాలో కూడా ఈ కథనాలు ఆగకుండా రావడంతో ఆ కుటుంబం జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ కుటుంబ సభ్యులను అందరు వెలివేయడం, గేలి చేయడం మొదలెపట్టారు. బ్యాంక్ అకౌంట్‍లు నిలిపివేశారు. చివరకు నిత్యావసర వస్తువులు గూడ దొరకడం కష్టం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్‍కు లైఫ్‍కి ప్రమాదం ఏర్పడిందని, ఎవరన్నా వచ్చి చంపి వేసి అవకాశం ఉందని ఆందోళన పడుతున్నారు.
ఇది పూర్తిగా నిరాధారమని, తాను కరోనా టెస్ట్ చేయించుకొంటే నెగటివ్ (రోగం లేదు అని) వచ్చిందని, అయినా మమ్మల్ని ఈ విధంగా అసత్యవార్తలతో వేధిస్తున్నారని ఆమె సీఎన్‍ఎన్ వారికి తెలిపింది. అంటే చైనా దేశంలో ఈ కరోనా అమెరికా నుంచి వచ్చిందని నమ్మించటానికి కొన్ని ప్రభుత్వ, లేదా రాజకీయ వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయన్నమాట.