తానా మహాసభలకు అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న కన్వెన్షన్ సెంటర్
తానా మహాసభలకు వేదిక ముస్తాబవుతోంది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. వీటి కోసం కన్వెన్షన్ సెంటర్‌ను అత్యద్భుతంగా సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. ఆకట్టుకునే అలంకరణలు, సంప్రదాయ బద్ధమైన వేదికలతో కన్వెన్షన్ సెంటర్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లను చూసిన తానా పెద్దలు శ్రీ జయరామ్ కోమటి, శ్రీ గంగాధర్ నాదెళ్ల తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తానా మాజీ అధ్యక్షులు శ్రీ గంగాధర్ నాదెళ్ల మాట్లాడుతూ.. 2001లో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తానా సభలు ఇదే కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయని గుర్తుచేసుకున్నారు. 22 ఏళ్ల తరువాత మళ్లీ ఫిలడెల్ఫియాలో ఇదే కన్వెన్షన్ సెంటర్‌లో తానా మహాసభలు జరగడం చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Tags :