ఏపీలో మళ్లీ అధికారం... టీడీపీదే
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చే అకాశముందని మరో సర్వే సృష్టం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ.. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో తమ నెట్‌వర్క్ ఉన్న కార్పొరేట్ చాణక్య అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. టీడీపీ 98 నుంచి 101 స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 71 స్థానాల వద్ద ఆగిపోతుందని అంచనా వేసింది. జనసేనకు 3 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 3వ తేదీ మధ్య ప్రజాభిప్రాయం సేకరించింది. నియోజకవర్గానికి 4 వేల నుంచి ఐదు వేల మంది ఓటర్లను ప్రశ్నించింది. ఓటరు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడని, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే టీడీపీ 110 స్థానాలకుపైగా గెలుచుకోవచ్చనని కార్పొరేట్ చాణక్య అంచనా వేసింది. సర్వేలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించగా, చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని 53.8 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది.
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని కోరుకుంటున్నారని అడగ్గా అత్యధికులు చంద్రబాబుకే మద్దతు తెలిపారు. 48.3 శాతం మంది మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని చెప్పగా.. 41.1 శాతం మంది ఒక జగన్ కావాలని అభిప్రాయపడ్డారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం కావాలని కేవలం 6.4 శాతం మంది కోరుకోవడం గమనార్హం.