తానా కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్
కోవిడ్ 19 వైరస్‍తో అమెరికాలో రోజురోజుకు పరిస్థితి దిగజారుతుండటంతో అమెరికాలోని వైద్యసేవలకు, సిబ్బందికి సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోవిడ్ 19 పేరుతో రిలీఫ్ ఫండ్‍ను ఏర్పాటు చేసింది. దీనికి సభ్యులతోపాటు ఇతరులంతా తమవంతు సహాయాన్ని అందించాలని తానా ఒక ప్రకటనలో కోరింది.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ప్రస్తుతం తమ టార్గెట్ లక్ష రూపాయల డాలర్లుగా పెట్టుకున్నామని, దీనిని మరింతగా పెంచనున్నామని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి తానా సభ్యుడు తనవంతుగా ఎంతో కొంత విరాళం ఇవ్వాలని కోరారు. ఈ విషయమై తానా పెద్దలు జయరామ్‍కోమటి, గంగాధర్ నాదెళ్ళ తదితరులతోపాటు సతీష్ వేమన ఇతరుల సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తానా చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి అందరినుంచి మంచి మద్దతు లభించింది. ఎంతోమంది తమవంతుగా విరాళాలను ఇస్తున్నారు. తానా ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయడంలో ఎప్పుడూ ముందుంటోందని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ ఫండ్‍కు సంబంధించి లింక్‍ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు కూడా సహాయపడవచ్చు.
Click here for Covid-19 Relief Fund by TANA