సంబరాల్లో అత్యవసర చికిత్సపై శిక్షణ
న్యూజెర్సిలో నాట్స్ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పొజిషన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో వైద్యానికి కూడా ప్రాముఖ్యనిస్తూ, అత్యవసర సమయాల్లో ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంపై శిక్షణను ఇవ్వనున్నారు. సిపిఆర్ విధానంపై అనుభవశాలులచేత శిక్షణను ఇప్పించనున్నారు. మే 28వ తేదీ ఈ కార్యక్రమం జరగనున్నది. యాక్ట్ నౌ అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనలనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Tags :