ASBL Koncept Ambience

డొనాల్డ్ ట్రంప్‍ కోసం సాల్మన్‍ టిక్కా

డొనాల్డ్ ట్రంప్‍ కోసం సాల్మన్‍ టిక్కా

రాష్ట్రపతి రామ్‍నాథ్‍ కోవింద్‍ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍కు విందు ఇవ్వనున్నారు. ఈ విందులో రెండు దేశాలకు చెందిన డిష్‍లు.. అతిధులను నోరూరించనున్నాయి. ట్రంప్‍ కోసం భారీ మెనూనే ప్రిపేర్‍ చేశారు. సాల్మన్‍ ఫిష్‍ టిక్కా, దాల్‍ రైసినా, రాబ్రీ లాంటి ప్రత్యేక వంటకాలను తయారు చేస్తున్నారు. భిన్న రుచులను అగ్రదేశాధినేత కోసం వడ్డించనున్నారు. డోనాల్డ్ ట్రంప్‍ కోసం ప్రత్యేక ఎపిటైజర్‍ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత స్టార్టర్లు ఉండనున్నాయి. అయితే ప్రతి వంటకానికి దాదాపు అమెరికన్‍ టచ్‍ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బోన్‍లెస్‍ ఫిష్‍ టిక్కాను స్పెషల్‍గా వడ్డించనున్నారు. సాల్మన్‍ ఫిష్‍తో తయారు చేసిన టిక్కాను ఆయనకు సర్వ్ చేయనున్నారు.

 

Tags :