ASBL Koncept Ambience

ఆరేళ్ళ తర్వాత భక్తులకు దర్శనం...

ఆరేళ్ళ తర్వాత భక్తులకు దర్శనం...

యాదాద్రి ప్రధానాలయంలో భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. ఆరేళ్ళ తర్వాత గర్భగుడి నుంచి భక్తులకు స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తున్నారు. నమో నారసింహ నినాదాలతో యాదాద్రి ప్రధానాలయం మారుమ్రోగుతున్నది. స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం స్వామి వారిని మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శనం చేసుకున్నారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు దర్శనం చేసుకున్నారు.

 

Tags :