కెనడా అల్బెర్టా కాల్గరీ లో ఘనంగా శరన్నవరాత్రులు
కెనడా అల్బెర్టా కాల్గరీ లో అనఘా దత్త సాయిబాబా మందిరం లో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగినది. ఆలయ ప్రధాన శ్రీమతి లలిత, శైలేష్ గార్లు మరియు చాలా వాలంటీర్లు పాల్గొని ఈ ఈవెంట్ ని చాలా ఘనంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజకుమార్ శర్మ గారు ప్రతినిత్యం అమ్మవారికి అలంకరణ, పూజ హోమాలనో శరన్నవరాత్రి విశిష్టతలను చక్కగా వివరించారు. శ్రీ బాల త్రిపుర సుందరి; శ్రీ గాయత్రి మాత; శ్రీ అన్నపూర్ణ దేవి; శ్రీ లలిత త్రిపుర సుందరి; శ్రీ మహా లక్ష్మి; శ్రీ సరస్వతి; శ్రీ దుర్గ; శ్రీ మహిసాసుర మర్దిని; శ్రీ రాజ రాజేశ్వరి అలంకారాలతో నిత్య పూజలు జరిగినవి. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలతో, బాబా గారి నిత్య విశిష్ట భక్తి పూజలతో ప్రతి నిత్యం విశిష్ట అలంకారాలతో ఘనంగా జరిగినవి. లోకల్ కళాకారులు భరతనాట్యం ప్రదర్శించారు. 450 ఫ్యామిలీస్ భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అందరికి తీర్ధ ప్రసాదాలు అందించబడ్డాయి.