డల్లాస్‌లో ఉత్సాహంగా జరిగిన దీపావళి వేడుకలు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టెక్సాస్‌లోని డల్లాస్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు 500 మందికిపైగా ఎన్నారైలో హాజరయ్యారు. ‘ది రిడ్జ్ ఎట్ నార్త్‌లేక్’ సమీపంలో జరిగిన ఈ వేడుకలను స్థానిక భారతీయ కమ్యూనిటీ, సోషల్ కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి. లలిత శెట్టి, నస్రీన్ వల్లి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపావళి వేడుకలను భారతీయ కమ్యూనిటీ తెగ ఎంజాయ్ చేసింది. గణపతి, శ్రీరాముని గీతాలాపనతో చిన్నారులు ఈ వేడుకలను ప్రారంభించారు. ఫ్యాషన్ షో, మ్యూజిక్, డ్యాన్స్ తదితర కార్యక్రమాల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన డిన్నర్ కూడా అందరికీ నచ్చింది. శ్రీదేవి చిలువూరి, సబిత కనపర్తి, స్వర్ణ ఆనంద్, హిమా చల్ల, శ్రీ లిఖిత, సంధ్య పిట్టల, వినయ్ రాజ్, ఆల్విన్ లోబో, ఉల్లాస్ భట్, కాజా వలి, పవన్ కోడూరు, తేజ కొసరాజు, మధు రావులపల్లి, కృష్ణ పిట్టల, అనీష్ అబ్రహం, చైతన్య మామిడిపాక, ప్రియా లోబో, ఆంబర్ ములిన్స్, మేఘ ఉల్లాస్, భవ్య మామిడిపాక, నౌరీన్ ఫయాజ్, షాన్ లోబో, నయన కనపర్తి, అను ఆనంద్, మమత కర్ణాటి, లావణ్య రెడ్డి, గీతా రామ్మూర్తి,విజి కార్తిక్, కాంతి ప్రియ, కాంచన వాడి, రమ్య, శ్వాతి వడ్డి, షీతల్, తన్మయి, దీపిక తదితరులంతా కలిసి ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. కమ్యూనిటీ మేనేజర్ మేగన్ యంగ్‌బ్లడ్ కూడా అందరికీ ఎంతో సహకారం అందించారు.