ASBL Koncept Ambience

సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో మరో కీలక ఘట్టం

సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో మరో కీలక ఘట్టం

ముచ్చింత్‌లోని సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమతామూర్తి కేంద్రంలో 33 స్త్రీ దేవతామూర్తల విగ్రహాలను ప్రతిష్టించారు. 108 దివ్య దేశాల్లోని 33 ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్టాపన జరిగింది. యాగశాల నుంచి 33 స్త్రీ వేదతామూర్తులతో శోభయాత్ర ఘనగా నిర్వహించారు. దేవతమూర్తులను దివ్య దేశాలకు 33 మంది ఉపద్రష్టులు తీసుకెళ్లారు. దేవతామూర్తుల శోభయాత్రను చినజీయర్‌ స్వామి పర్యవేక్షించారు. సమతామూర్తి, 108 దివ్యదేశాల దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. యాగం, శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకించారు.

 

Tags :