ASBL Koncept Ambience

అట్లాంటాలో హిట్టయిన ధీంతానా పోటీలు

అట్లాంటాలో హిట్టయిన ధీంతానా పోటీలు

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై7 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని అట్లాంటాలో వైభవంగా ధీంతానా పోటీలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 30వ తేదీన నిర్వహించిన కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌కు మంచి స్పందన వచ్చింది. జ్యోతి ప్రజ్వలన తరువాత సబ్‌ జూనియర్‌ సోలో సింగింగ్‌ కార్యక్రమంతో కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 10 గంటలపాటు ఈ పోటీలు సాగాయి. 

సింగింగ్‌, డ్యాన్స్‌, అందాల పోటీలు, చిలక గోరింక పోటీల్లో దాదాపు 112 మంది పాల్గొన్నారు. తానా కొత్తగా ప్రవేశపెట్టిన చిలకగోరింక పోటీలకు మంచి ఆదరణ కనిపించింది. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు రఘుకుంచెతోపాటు పలువురు తానా నాయకులు, ధీంతానా చైర్‌ మాలతినాగభైరవతోపాటు కో చైర్స్‌ సోహిని అయినాలా, అలాగే కమిటీ సభ్యులు పూలని జాస్తి, ఆర్తిక అన్నే, ప్రియాంక గడ్డం హాజరయ్యారు. 

క్లాసికల్‌ డ్యాన్స్‌ పోటీలకు జడ్జిలుగా డా. సుధారాణి కల్వగుంట (డల్లాస్‌), డా. రాజేష్‌ అడుసుమిల్లి (డల్లాస్‌), శివ అట్లాంటాకు చెందిన శివ తుర్లపాటి, సోబియా సుందిప్‌ వ్యవహరించారు.

సింగింగ్‌ పోటీలకు జడ్జిలుగా ఫణి డొక్కా, రామ్‌ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, జనార్దన్‌ పన్నెల ఉన్నారు.

అందాల పోటీలకు  జడ్జిలుగా వృశాలి అంగర, మల్లికా రెడ్డి, బిందు గోపాలం, చిలక గోరింక పోటీలకు డా. నందిని సుంకిరెడ్డి, డా.నీలిమ చిరు, కిషోర్‌ తాటికొండ జడ్జిలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో విజేతలను ఎంపిక చేశారు. 

క్లాసికల్‌ సింగింగ్‌ (సోలో) సబ్‌ జూనియర్స్‌ పోటీల్లో విన్నర్‌గా సిరి కౌతా, ఫస్ట్‌ రన్నరప్‌గా కార్తిక్‌ రెడ్డి, 2వ రన్నరప్‌గా నవ యుక్తా ఎంపికయ్యారు. 

క్లాసికల్‌ సింగింగ్‌ (సోలో) జూనియర్స్‌ పోటీల్లో విన్నర్‌గా రిధి ఓత్రా, ఫస్ట్‌ రన్నరప్‌గా రితుక, 2వ రన్నరప్‌గా ఆయుక్తా  నిడిముక్కల ఎంపికయ్యారు. 

క్లాసికల్‌ సింగింగ్‌ (సోలో) సీనియర్స్‌ పోటీల్లో విన్నర్‌గా తన్మయి బుచి, ఫస్ట్‌ రన్నరప్‌గా జయని కారుమంచి ఎంపికయ్యారు. 

క్లాసికల్‌ సింగింగ్‌ (సోలో) పెద్దల పోటీల్లో విన్నర్‌గా మనిషా వారణాశి, ఫస్ట్‌ రన్నరప్‌గా గౌరి కారుమంచి ఎంపికయ్యారు. 

సినిమా, జానపద గీతాల పోటీల్లో 

సబ్‌ జూనియర్స్‌ లెవల్లో విజేతగా కార్తిక్‌ రెడ్డి, ఫస్ట్‌ రన్నరప్‌గా తన్విఅంచ, 2వ రన్నరప్‌గా నిక్ష బత్తుల, జూనియర్స్‌ లెవెల్లో మహోఓత్రా విజేతగా నిలిచారు. సీనియర్స్‌ పోటీల్లో జయని కారుమంచి విజేతగా, పెద్దల పోటీల్లో మనిష వారణాశి విజేతగా నిలిచారు.

క్లాసికల్‌ డ్యాన్స్‌ గ్రూపు పోటీల్లో

సబ్‌ జూనియర్‌ కేటగిరిలో మహాగణపతి టీమ్‌ విజేతగా నిలిచింది. జూనియర్స్‌ విభాగంలో చరిత, టీమ్‌, సీనియర్స్‌ కేటగిరిలో వినీల, ఆమె టీమ్‌ గెలిచింది.

ఫిల్మీ, ఫోక్‌ డ్యాన్స్‌ గ్రూపు పోటీల్లో

సబ్‌ జూనియర్స్‌ కేటగిరిలో అర్జున్‌, హియ విజేతలుగా నిలిచారు. సీనియర్స్‌ విభాగంలో తరుణ్‌ కారుమంచి`టీమ్‌ విజేతగా నిలవగా, అడల్ట్స్‌ విభాగంలో ఉదయ`టీమ్‌ విజేతగా నిలిచింది. 

మిస్‌ టీన్‌ తానా పోటీల్లో అరుషి నాగభైరవ విజేతగా నిలిచింది. మిస్‌ తానా పోటీల్లో మనోఙ్న విజేతగా నిలిచింది. మిసెస్‌ తానా పోటీల్లో గౌతమి ప్రేమ్‌ విజేతగా నిలిచింది. 
చిలకగోరింక పోటీల్లో విజేతగా కాంతిరేఖ అండ్‌ తిరు నిలిచారు.

ఈ పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించినవారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుఫుడ్స్‌, సంప్రసాఫ్ట్‌, మాక్సిమ్‌, మధు యార్లగడ్డ, లెగసీ అకాడమీ, అస్యూర్‌గురు, బాంబే లాంజ్‌, ఔరా ఈవెంట్‌ అండ్‌ డెకర్‌ ఫర్‌ బ్యూటిఫుల్‌ డెకర్‌, ఎఆర్‌ డేజిల్‌ ఈవెంట్స్‌ ఫర్‌ సౌండ్‌ సిస్టమ్‌ అండ్‌ లైట్స్‌, అలాగే నేషనల్‌ స్పాన్సర్లుగా గ్రాండ్‌ స్పాన్సరర్‌ జూబ్లియన్స్‌ శష హోమ్స్‌, సిల్వర్‌ స్పాన్సర్స్‌, ఓక్టేవ్‌, స్పాష్‌ బిఐ, షూరా ఇబి5 పూజావాద్వాని వ్యవహరించారు. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవిపొట్లూరి ధన్యవాదాలు తెలియజేశారు.  

 

Click here for Photogallery

 

 

Tags :