వర్జీనియాలో ధీమ్ తానా జాతీయ పోటీలకు మంచి స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో ధీమ్‌తానా పోటీలను ఏర్పాటు చేసింది. సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్సింగ్, కపుల్ డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా పేరుతో నిర్వహించిన ఈ పోటీలు వివిధ నగరాల్లో ప్రాంతీయ స్థాయిలో జరిగాయి. వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో జూన్ 8వ తేదీన జరిగిన జాతీయస్థాయి ధీమ్‌తానా పోటీల్లో ఎంతోమంది పాల్గొన్నారు. దాదాపు 2 వేలమంది ఈ పోటీల కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వివిధ వయస్సులవారు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో విన్నర్లుగా, రన్నరప్‌లుగా నిలిచినవారు జూలై 4వ తేదీన జరిగే ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు.
ధీమ్‌తానా పోటీల కమిటీ చైర్ సాయిసుధ, అడ్వైజర్ సత్య సూరపనేని ఈ పోటీలను నిర్వహించారు. సుష్మ, గీత, ప్రవీణ్, దివ్య, నవీన్, అమర్, ప్రసన్న, రాధిక, స్వాతి, శిరీష, హరీష్, పద్మజ, జ్యోతి, కళ్యాణి, గోపీనాథ్, శిరీష టీ, చిత్ర, అపర్ణ, కల్పన, చైతన్య, సురేఖ ఈ పోటీల నిర్వహణకు సహకరించారు.
ఈ పోటీలకు ప్రత్యేక అతిధులుగా మిస్ ఇండియా వరల్డ్ వైడ్ సైనీ, హీరోయిన్‌లు అనిత చౌదరి, అంకిత హాజరయ్యారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన, వెంకటరావు మూల్పూరి, నరేన్ కొడాలి, జే తాళ్ళూరి, రవి పొట్లూరి, రఘు మేక, రవి గౌరినేనితోపాటు తానా కాన్ఫరెన్స్ కమిటీ చైర్‌పర్సన్‌లు ఇతరులు హాజరయ్యారు. వర్జీనియాలోని పర్సిస్, ప్యారడైజ్ (మేరీలాండ్) వారు ఆహారాన్ని అందజేశారు.