ASBL Koncept Ambience

ఛార్లెట్ తానా టీమ్ ఆధ్వర్యంలో స్టూడెంట్ లకు లంచ్‍ బాక్స్ ల పంపిణీ

ఛార్లెట్ తానా టీమ్ ఆధ్వర్యంలో స్టూడెంట్ లకు లంచ్‍ బాక్స్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్‍ టీమ్‍ ఆధ్వర్యంలో యుఎన్‍సి ఛార్లెట్‍ విద్యార్థులకు నిత్యావసర సరకులను, ఫుడ్‍ ఐటెమ్స్ లను పంపిణీ చేశారు. కోవిడ్‍ 19 కారణంగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, అవసరమైన సమయంలో తానా మమ్మల్ని ఆదుకున్నట్లు వారు తానా నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తానా ప్రెసిడెంట్‍ జయ్‍తాళ్ళూరి, అంజయ్య చౌదరి లావు, సతీష్‍ వేమన, రవి పొట్లూరి, సురేష్‍ కాకర్ల, మల్లివేమన, శ్రీనివాస్‍ చంద్‍, గొర్రెపాటిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తానా ఛార్లెట్‍ నాయకులు పట్టాభి కంఠమనేని, నాగ పంచుమర్తి, టాగూర్‍ మల్లినేని, మాధురి ఏలూరు, పార్థసారథి గుణిచెట్టి తెలిపారు.

 

Tags :