హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు...స్వెటర్ల పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అడ్వైజర్ కౌన్సిల్ ఛైర్ డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సేవాడేస్ పేరుతో టీటీఏ కార్యనిర్వాహక బృందం తెలంగాణలోని కాప్రాలో పర్యటించి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించింది. కాప్రాలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేసింది. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస మానాప్రగడతో పాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని 250 మంది విద్యార్థులకు స్వెటర్లను అందించారు. ఈ సందర్భంగా టీటీఏ నాయకులను టీచర్లు, స్థానిక నాయకులు అభినందించారు.
డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల మాట్లాడుతూ, టిటిఎ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సేవాడేస్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఇక్కడ స్వెట్టర్లను పంపిణీ చేశామని చెప్పారు. అలాగే పాఠశాలను మరింతగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి, సత్కరించారు.
డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల శ్రీనివాస మానాప్రగడ, వెంకట్ ఎక్క, ప్రసాద్ వుప్పలపు మరియు విజయ్ సేరి టిటిఎ సలహా మండలికి నాయకత్వం వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధ్యక్షుడిగా కిరణ్ బసాని, ప్రధాన కార్యదర్శిగా సరస్వతి వర్కూర్, కోశాధికారిగా సుబ్రత గడ్డం ఉన్నారు. డైరెక్టర్ల బోర్డులో సునీల్ మర్రి, అంజన్ కర్నాటి, రవికుమార్ నేతి, నందాదేవి శ్రీరామ, ఈశ్వరి పచ్చనూరి (జ్యోతి), లవ కుమార్, వినయ్ కుమార్ వర్మ, మరియు మనోహర్ గడ్డం ఉన్నారు.
తామంతా కలిసి సమాజానికి తమ అంకితమైన సేవను కొనసాగిస్తామని, భవిష్యత్తులో కమ్యూనిటీకోసం అటు అమెరికాలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.