సూది రంధ్రంలో డొనాల్డ్ ట్రంప్ సూక్ష్మ శిల్పం
వరంగల్ అర్బన్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన మైక్రో శిల్పి మట్టెవాడ అజయ్‍కుమార్.. సూది రంధ్రంలో మైనంతో చెక్కిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ జాతీయ జెండాను ఇనుమడింపజేశాడు. ఎత్తు 1.25 ఎంఎ, వెడల్పు 0.32 ఎంఎం కలిగిన ట్రంప్ శిల్పం. అలాగె త్తు 0.94 ఎంఎం, వెడల్పు 0.64 ఎంఎం కలిగిన అమెరికా జాతీయ జెండాను రూపొందించాడు. ఈ సూక్ష్మ శిల్పాన్ని రూపొందిచడానికి అజయ్ నాలుగురోజుల్లో 13 గంటల పాటు శ్రమించారు. ఈయన గతంలో దండి మార్చ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సూక్ష్మ శిల్పాలను సూది రంధ్రంలో చెక్కి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.
Tags :