జాతిపిత మహాత్మ గాంధీకి డొనాల్డ్ ట్రంప్ నివాళులు
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలం రాజ్‍ఘాట్‍ను సందర్శించారు. బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. మహాత్ముడి ఆలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైన భారత్‍కు అమెరికా ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఇదినాకు దక్కిన అద్భుతమైన గౌరవం అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి.. ట్రంప్ దంపతులకు మహాత్ముడి ప్రతిమను బహుమతిగా ఇచ్చారు. అనంతరం రాజ్‍ఘాట్ ప్రాంగణంలో ట్రంప్ ఓ మొక్కను నాటారు. రాజ్‍ఘాట్ నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్‍కు బయల్దేరారు.
Tags :