సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. సబర్మతి ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమాన్ని ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ సందర్శించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి ట్రంప్ నూలు దండ వేసి నివాళులర్పించారు. ట్రంప్ తన షూస్ విప్పి మాత్రమే ఆశ్రమం లోపలికి వెళ్లడం విశేషం. ఇప్పటి వరకు అనేక మంది అమెరికా అధ్యక్షులు భారత్‍లో పర్యటించినప్పటికీ, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తొలి అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. ఈ ఆశ్రమం లోపల ఉండే హృదయ్‍కుంజ్‍లో ఏర్పాటు చేసిన చరఖాపై ట్రంప్ నూలు వడుకుతుండగా మెలానియా ఆసక్తిగా తిలకించారు. సుమారు 30 నిమిషాల పాటు ట్రంప్ ఆయన భార్య మెలానియా, ప్రధాని మోదీ ఈ ఆశ్రమంలో గడిపారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశాన్ని రాసి సంతకం పెట్టారు.
Tags :