ASBL Koncept Ambience

నాటా సాహితీ పురస్కారం అందుకున్న డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి

నాటా సాహితీ పురస్కారం అందుకున్న డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మహా సభలలో అనంతపురం నివాసి సాహితీ, సామాజిక రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి నాటా విశిష్ట సాహితీ పురస్కారం అందుకున్నారు. మహాసభలో అవార్డు ప్రధాన ప్రత్యేక కార్యక్రమం నాటా అధ్యక్షులు కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి నిర్వహించారు. నాటా వ్యవస్థాపకులు డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాటా సలహా మండలి చైర్మన్‌ డా. ఆదిశేషారెడ్డి, బోర్డు సభ్యులు ఆళ్ల రామిరెడ్డి, గోసాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరినాథరెడ్డి చేస్తున్న సాహిత్య కృషిని వివరించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత సాంస్కృతిక వికాసానికి చేస్తున్న ప్రయత్నానికి అభినందించారు. మహా సభలలో భాగంగా కొనసాగిన రాయలసీమ సదస్సులో డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ముఖ్యవక్తగా పాల్గొని, రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, సమకాలిన సమస్యలపై ప్రసంగించారు. సీమ జనజీవితం నీళ్లతో ముడిపడి ఉందని అందరూ నీళ్ల సాధనకు సిద్ధం కావాలన్నారు. రాయలసీమలో ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక వికాసానికి, అభివృద్ధికి ప్రవాస సీమవాసులు మద్దతుగా నిలవాలన్నారు.

 

 

Tags :