తానా మహాసభల్లో పాల్గొన్న డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన తానా మహాసభల్లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. హైదరాబాద్‌లో ఉన్న బంధుమిత్రులకు ఈ మేరకు కాంగ్రెస్‌కు ఓటేయాల్సిందిగా సూచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రోజురోజుకూ పార్టీ బలపడుతున్నదని వెల్లడించారు.
Tags :