చంద్రబాబుతో సమావేశమైన నోరి దత్తాత్రేయుడు
అత్యంత అధునాతన ఐఓటీ సాంకేతికతను అన్వయించి క్యాన్సర్ నివారణ చికిత్సను మరింత మెరుగుపర్చాలని, రోగుల జీవితకాలం పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమెరికాలో స్థిరపడిన మనదేశ సుప్రసిద్ధ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడు సోమవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య బ ందాలు మారుమూల గ్రామాలు వెళ్లి మహిళలకు క్యాన్సర్ నిర్ధారణకోసం స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. లక్షలాది మహిళలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారని వివరించారు. క్యాన్సర్ వైద్య చికిత్స కూడా మారుమూల ప్రాంతాలకు అందించాలన్నది తమ అభిమతమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
క్యాన్సర్ వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డాక్టర్ దత్తాత్రేయుడు తమ అంగీకారాన్ని తెలిపారు. . అమెరికాలోని 'సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్' ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ వైద్యులకు అత్యంత అధునాతన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. మారుమూల ప్రాంతాలలో రోగులకూ నూతన చికిత్సలు అంజేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. భావి వైజ్ఞానిక యుగానికి చోదకశక్తిగా నిలవాలని, ముఖ్యంగా వైద్యరంగంలో 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఆవిష్కరణల విస్త తికి తోడ్పడాలన్న ముఖ్యమంత్రి సూచనను స్వాగతించారు. వైద్యఆరోగ్య రంగంలో, సంబంధిత రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సొంత రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.